Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మహిళా సంఘాలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో మహిళా గ్రూపులు బ్యాంకుల ద్వారా పొందుతున్న  రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డిపియం స్వర్ణలత అన్నారు. శనివారం మండల కేంద్రం లోని గ్రామీణ బ్యాంకు అధికారులు సెర్ప్ సిబ్బంది మరియు వి.ఓ.ఏ లతో  నిర్వహించిన ప్రత్యేక సమా వేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న  పలు రకాల kరుణాలను సద్వినియోగం చేసు కుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఇదివరకే రుణాలు తీసుకున్న సభ్యులు వారి యొక్క వ్యాపారాలను మరింత అభివృద్ధి పరిచేందుకు అదనంగా రుణాలు తీసుకోవచ్చని  తెలిపారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్ రాజేష్ ప్రసాద్  మాట్లాడుతూ ఈ ఏడాది ముత్యంపల్లి శాఖ ద్వారా మహిళా సంఘాలకు రూ.13 కోట్ల 31 లక్షలకు పైగా రుణాలు అందిం చడం జరిగిందని అన్నారు. తీసు కున్న రుణాలు ప్రతినెల సక్రమంగా చెల్లిస్తు న్నందున మహిళా సంఘాలకు రూ.4 కోట్ల మేర అదనంగా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ముత్యంపల్లి శాఖకు మొద టిసారిగా డిపియం రావడంతో ఆమెను బ్యాంకు అధికారులు శాలువతో  సన్మానించారు. అనంతరం  మండలంలో నిర్వహిస్తున్న కందుల సర్వే గురించి ఐకెపి సిబ్బందిని ఆమె అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల వద్దకు వెళ్ళి పండించిన పంటను పరిశీ లించారు. ముత్యం పల్లి గ్రామం లోని  బోయిన కొమురయ్య అనే రైతు వద్ద ఉన్న  కందులను పరిశీలించారు.  రైతు వద్ద దాదాపు 200 క్వింటాళ్లకు పైగా కందులు ఉండడంతో వారితో మాట్లా డుతూ, ప్రయివేట్ దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకు అమ్మాలని సూచించారు. గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ వాటిని కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు ఆశిష్, ముత్యాలరాజు , ఎపియం వెంకటేష్, సిసిలు, ఎమ్మెస్ సిసిలు, వివోఏ లు తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App