Digital Kasipet:-
విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించాలంటే లక్ష్యం పెట్టుకొని చదవాలని ఇన్ఫెక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దివేణి అర్జున్ విద్యార్థులకు తెలిపారు. గురువారం కాసిపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో మొదటిసారిగా ఇంటర్ పదవ తరగతి విద్యార్థులకు లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కల్పించారు. వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే సెల్ ఫోన్, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అన్నారు. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలకు అనుగుణంగా చదివినప్పుడే విజయం సాధిస్తామని అన్నారు.