Digital Kasipet:-
వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల ఐక్యకార్యాచరణ కమిటీ పిలుపుమేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి కాసిపేట మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం ఆందోళనకు దిగారు. అసెంబ్లీ లో నూతన రెవెన్యూ చట్టం చేస్తున్న సందర్భంగా 2020 సెప్టెంబర్ 9న వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా జీవోను విడుదల చేయడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా పే స్కేలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు 23వేల మంది ఉన్నామని ప్రభుత్వ రెవెన్యూ,సంక్షేమ పథకాల అమలులో తమదే క్రియాశీల పాత్ర ఉందని వీఆర్ఏ లు అంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారే ఉన్నారని చాలి చాలని జీతాలతో పస్తులతో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.