Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గంజాయి మత్తు పదార్థాలు నిషేదం సాధ్యం : ఎస్ఐ కాసిపేట

Digital Kasipet:- 
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపల్లి గ్రామంలో శుక్రవారం ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో గంజాయి నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గంజాయి మత్తు పదార్థాల నిషేదం సాధ్యమని అన్నారు. గంజాయి, గుడుంబా, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కొరారు. యువకులు నేర ప్రవృత్తి అలవాటు పడడానికి  మత్తు పదార్థాలు మొదటి వరుసలో ఉన్నాయని వాటిని నిషేదించినపుడే సమాజం బాగుంటుందని పేర్కొన్నారు. నిషేదిత మత్తు పదార్థాలను ప్రజలందరూ బహిరంగంగా నిషేదిస్తే గ్రామీణ ప్రాంత యువత చైతన్య వంతులు అవుతారని, వాటి జోలికి వెళ్లకుండా ఉంటారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ సాగు, సరఫరా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు, స్థానిక యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App