Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది - బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్

Digital Kasipet:- 
నేటి సమాజంలో  మనుషుల్లో    నైతిక విలువలు పతనం అవుతూ విద్యార్థులు విష సంస్కృతి బారిన పడుతున్నారు. ఇలాంటి సమాజాన్ని మార్చే శక్తి ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని   బెల్లంపల్లి పోలీస్ డివిజన్ ఏసీపీ ఎడ్ల మహేష్ అన్నారు. మంగళవారం  రామగుండం  పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లం పల్లి పోలీస్ డివిజన్ కాసిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో గంజాయి మత్తు పదార్థాలు నియంత్రణపై కాసిపేట మండల ప్రభుత్వ ఉపాధ్యాయులకు గాహన సదస్సు   నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏసిపి  ఎడ్ల మహేష్ మాట్లాడుతూ మత్తు  పదార్థాలకు, ఉపాధ్యాయులకు సంబంధం లేకున్న పాఠశాలల్లోనే విద్యార్థులను భావి భారత పౌరులను తీర్చి దిద్దే శక్తి  ఉపాధ్యాయులకు మాత్రమే  ఉండడంవల్ల  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు  మత్తు  పదార్థాలపై   అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. నేటి సమాజంలో మనిషి ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దా లంటే నాలుగు అంశాలు ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి అన్నారు. కుటుంబము,తల్లిదండ్రులు, పాఠశాల, ఉపాధ్యాయులు, స్నేహితులు, పరిసరాలు పెరిగే వాతావరణం అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచాలంటే  ఉపాధ్యాయులే భయపడు తున్నారని అన్నారు. చదవకుండా ఉంటూ , క్రమ శిక్షణగా ఉండకుంటే  కొడితే తల్లిదండ్రులు ఎక్కడ వచ్చి గొడవ చేస్తారనో  మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళతారో నాని భయపడి చదువు చెప్పడమే మానేస్తున్నారు. వెనకటి రోజుల్లో  ఉపాధ్యాయులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ  బోధన చేసేవారని అన్నారు. విద్యార్థులు తప్పు చేస్తే చేతి కర్రతో కొడుతూ, గుంజీలు తీస్తూ గోడ కుర్చీలు వేయించేవారు అని అన్నారు. అలా కష్టపడి విద్యలు నేర్చుకున్న మేము ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. కరోనా పుణ్యమా అని విద్యార్థులు చదువులు మరిచిపోయి సెల్ ఫోన్ లో   ఫేస్ బుక్,యూట్యూబ్  వీడియోలు చూస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారాలు వస్తూ విపరీతంగా డబ్బులు సంపాదించడం వల్ల పిల్లలను  పట్టించుకోవడం మర్చిపోయారు అని అన్నారు. కార్పొరేట్  పాఠశాలలో  లక్షల రూపాయలు ఫీజు చెల్లించి చదివి పిలుస్తు న్నారని అన్నారు. డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్న వారి పిల్లల   విలాసవంతమైన జీవితం, సంతోషం పేరిట పబ్బుల్లో,బార్లలో  మత్తు  మందులు సేవిస్తూ గంజాయి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారన్నారు. ఇటీవల కాలంలో ఈ సంస్కృతికి పెరగడం వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని దీన్ని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ కోసం వాహన సదస్సులు నిర్వహిస్తు న్నామని అన్నారు. ఉపాధ్యా యులు  విద్యార్థులకు విద్యా బోధన తో పాటు చెడు అలవాట్లకు బానిసలు కావద్దని  బోధించాలని  కోరారు. మందమర్రి  సిఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గంజాయి, మత్తుపదార్థాలను  నియంత్రించాలంటే దానిపై  అందరికీ అవగాహన కలిగించాలని   ప్రభుత్వ ఆదేశాల మేరకు  కార్యక్రమాలు చేపట్టామన్నారు. మండల విద్యాధికారి దామోదర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు  క్రమ శిక్షణగా   చదువుకోవాలంటే  పాఠ్యాంశాల తోపాటు  దేశభక్తి గురించి, అను మహానుభావుల జీవిత చరిత్ర ల గురించి టాస్క్ లు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు డు లచ్చన్న, దేవాపూర్ ఎస్ఐ విజేందర్, ప్రభుత్వ  పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమావేశానికి కాసిపేట ఎస్సై కళ్యాణం నరేష్ అధ్యక్షత వహించారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App