Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో సోమవారం మండల సర్పంచుల సమావేశం జరిగింది. మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సోమగూడెం కె సర్పంచి సపాట్ శంకర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం వల్ల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పోస్ట్ ఖాళీగా ఉంది. మండలంలోని సర్పంచులు అంతా కోమటి చేను సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ ను మండల జెడ్ పి టి సి పల్లె చంద్రయ్య, ఎంపీపీ రోడ్డు లక్ష్మి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, మండల రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు దుర్గం పోచం, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మంజులారెడ్డి, వాసుదేవ్ మండల టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ నాయకులు అభినందనలు తెలిపారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కోమటి చేను సర్పంచ్ రామటెంకి శ్రీనివాస్ కు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూప్ అభినందనలు తెలుపుతుంది.