Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మపై ఫిర్యాదు

Digital Kasipet:- 
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండలంలోని కాసిపేట పోలీస్ స్టేషన్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ దేశంలో బిజేపి మోడీతో పాటు ఇతర నాయకులు ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతు భారతదేశం యొక్క విలువను దిగజారుస్తున్నారన్నారు. దేశం కోసం ధర్మం కోసం అంటూ దేశంలో అరాచక పాలన చేస్తున్నారు. వీరిని ఇలాగే వదిలిపెడితే దేశం సర్వనాశనం అవుతుందని, దేశ ప్రజలు రాబోవు రోజుల్లో  కచ్చితంగా వీరికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ,  కొత్త రమేష్, కనుకుల రాకేష్ ఉప సర్పంచ్, కూకట్ల దేవెందర్, ఈరవేణి  శ్రీనివాస్, రంగ నవీన్, రషిద్ లు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App