Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విభజన మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నరేంద్ర మోదీ దిష్టి బొమ్మ దహనం చేశారు..ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ దేశ ప్రధాని అయ్యి ఉండి పార్లమెంట్ లో డోర్ లు మూసి పెప్పర్ స్ప్రే చేసి, మైకులు ఆపి చర్చలు లేకుండా బలవంతంగా రాష్ట్ర విభజన చేసారని అని అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర హేయమైన చర్య అని అన్నారు. ఆనాడు సోనియాగాంధీ గారు తెలంగాణలో జరుగుతున్న వందలాది మంది విద్యార్థుల బలిదానాల చెల్లించి చలించి తెలంగాణ ఇచ్చిన దేవత అని కొనియాడారు. తెలంగాణ బిల్లుకు ఆనాడు పార్లమెంట్లో మద్దతు తెలిపిన బిజెపి నాయకులు ఈ రోజు ఇలాగ తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా దేశ ప్రధాని మంత్రిగా ఉన్న నరేంద్రమోడీ దిగజారుడు వాక్యాలు చేయడం తగదని అన్నారు .ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, గోలేటి స్వామి, మైధం రమేష్, జాడి శివ, బుగ్గ రాజు, ప్రేమ్ కుమార్ ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు ఆకుల శ్రావణ్, నందికొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.