Digital Kasipet:- దేశంలోని బొగ్గు గనుల ప్రైవేటీకరణకు నిరసనగా బుధవారం టి.బి.జి.కె.ఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ పిలుపుమేరకు కాసిపేట 2 గని వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను యూనియన్ నాయకులు తగలబెట్టారు. ఈ సందర్భంగా గని ఫిట్ సెక్రెటరీ కారుకూరి తిరుపతి మాట్లాడుతూ సింగరేణి లోని నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణకు నిరసనగా గత నెలలో 3 రోజులు సమ్మె చేసీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించా మన్నారు. బొగ్గు బ్లాకుల వేలానికి నిరసనగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, ప్రభుత్వం వాటా 49 శాతం ఉందని కేంద్ర ప్రభుత్వం వాటాను తమకే అమ్మాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని కోరారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో సింగరేణి కార్మికులు పెద్ద మొత్తంలో లాభాలు తీసుకువచ్చి దేశంలోని విద్యుత్తు ప్రాజెక్టులకు బొగ్గు అవసరాలు తీరుస్తారని అన్నారు . ఈ కార్యక్రమంలో కాసిపేట 2 గని సహాయక ఫిట్ సెక్రెటరీ తాళ్ల పెళ్లి శ్రావణ్ గౌడ్, రక్షణ మరియు మైన్స్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.