Digital Kasipet:-
పరీక్షల ముందు విద్యార్థులు భయాన్ని వీడి ధైర్యంతో లక్ష్యం పెట్టుకొని చదవాలని ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దివేణి అర్జున్ విద్యార్థులకు తెలిపారు. శుక్రవారం కాసిపేట మండల కేంద్రంలోని కస్తూరిబా మోడల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలి,లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కల్పించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆత్మన్యూనతా భావంతో పట్టణ ప్రాంత విద్యార్థులతో పోటీపడలేమనే భయం వల్ల చదవలేక పోతున్నారన్నారు. విద్యార్థులకు ధైర్యం కావాలంటే ముందు భయం వీడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం పెట్టుకుని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు. మన చదువుల వల్ల ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రానికి మన ఊరికి, మన తల్లిదండ్రులకు పేరు వచ్చి సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. మన తల్లిదండ్రులకు గ్రామానికి పేరు వచ్చే విధంగా లక్ష్యాలు పెట్టుకొని చదవాలనే విద్యార్థులను కోరారు. వార్షిక పరీక్షల్లో అధిక మార్కులు సాధించాలంటే సెల్ ఫోన్, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని అన్నారు. ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలకు అను గుణంగా చదివినప్పుడే విజయం సాధిస్తామని అన్నారు.