Digital Kasipet:-
కాసిపేట మండలం కోమటిచేను గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం కాసిపేట మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన రామటెంకి శ్రీనివాస్ ను పల్లం గూడా ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యుడు రామటెంకి వాసుదేవ్ ఆధ్వర్యంలో శాలువాల తో సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఎంపీటీసీ నవనందుల చంద్రమౌళి మాట్లాడుతూ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోమటిచేను పంచాయతీ నుండి ఎన్నిక కావడం తన ఎంపీటీసీ పరిధిలోని కోమటి చేను, పల్లంగూడెం, బుగ్గ గూడెం పంచాయతీ ప్రజలకు లకు గర్వకారణమని అన్నారు. బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యుడు వాసుదేవ్ మాట్లాడుతూ శ్రీనివాస్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కావడం నేతకాని సంఘానికి గర్వకారణమని అన్నారు. సన్మానం పొందిన శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి సర్పంచుల సంఘం అధ్యక్షుడు గా ఎన్నిక చేసినందుకు తోటి సర్పంచ్ లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నాకు సన్మానం చేసిన నాయకులకు కూడా ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమం లో పంచాయితీ ఉప సర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, వార్డు సభ్యులు ఆడే శేఖర్, సోనే రావు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి శేఖర్, మాజీ ఉప సర్పంచ్ వసంతరావు, టిఆర్ఎస్ నాయకులు దుర్గం రామచందర్, శంకర్ జాడి వినోద్ తదితరులు పాల్గొన్నారు.