Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేట్ ముందు శనివారం నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధారి మైసమ్మ జాతర పోస్టర్ను ఓరియంట్ సిమెంట్ కర్మాగారం అధ్యక్షుడు ఎస్కే పాండే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పాండే మాట్లాడుతూ దేశంలో ఆదివాసుల సంస్కృతి, జీవన విధానం గొప్పదని అన్నారు. ఇతర కోసం కంపెనీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండలం నాయక్ పోడ్ సేవా సంఘం మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తట్రా బీమ్ రావ్ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంజి రాజన్న, కోశాధికారి కొమ్ముల బాపు, యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్, బిజెపి మండల అధ్యక్షుడు కాలువ సతీష్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం దేవాపూర్ గ్రామ అధ్యక్షుడు గసికంటి మల్లేష్, దేవాపూర్ మాజీ ఎంపిటిసి రోడ్డ కిష్టయ్య, గ్రామ పెద్ద మనిషి రోడ్డ రాజం, మైసమ్మ పూజారి రోడ్ల లచ్చులు తదితరులు పాల్గొన్నారు.