Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Digital Kasipet:- 
కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన   పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలి అనే దానిపై ఇంపాక్ట్ మోటివేటర్ స్పీకర్ మద్దినేని అర్జున్  అవగాహన కల్పించారు. విద్యార్థులు  లక్ష్యం పెట్టుకుని చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు.  భవి ష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే  బలమైన లక్ష్యం పెట్టుకుని దానికి అనుగుణంగా మన మెదడులో పదే పదే విజువలైజ్ చేసుకోవాలని అర్జున్  సూచించారు. మన చదువుల వల్ల ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రానికి మన ఊరికి, మన తల్లిదండ్రులకు పేరు వచ్చి మన జీవితానికి సార్థకత వస్తుందని అన్నారు.  సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ కాసిపేట మండలానికి చెందిన మద్దినేని అర్జున్ ఇంపాక్ట్ మోటివే టర్ స్పీకర్ గా రావడం  మండల ప్రజలకు అదృష్టమన్నారు. అజ్ఞానంలో జీవిస్తున్న ప్రజలను జ్ఞానవంతులు చేసేందుకు అర్జున్ సేవలు ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాల విద్యార్థులకు  వ్యక్తిత్వ  వికాసం పాఠాలతో పాటు గ్రామాలలో  ప్రజలను, యువకులు చెడు అలవాట్లకు  బానిసలు కాకుండా  చైతన్యవంతం చేసే కార్యక్రమా లను సామాజిక చైతన్య వేదిక  జ్ఞానయాత్ర  చేపట్టడం జరుగుతుందన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ మోటివేటర్ స్పీకర్ అర్జున్   పదవ తరగతి విద్యార్థులకు  అసలు ఎలా రాయాలి లక్ష్యాన్ని ఎలా పెట్టుకోవాలి అనే విషయమై అద్భుతంగా వివరించారని అన్నారు. ఇన్చార్జి ప్రధానోపాధ్యా యులు దామోదర్ రెడ్డి మాట్లాడు తూ  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సామాజిక  చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంపాక్ట్ మోటివేటర్ అర్జున్ గారు విద్యార్థులకు పరీక్షలపై  చక్కటి  అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు. తదనంతరం  పదవ తరగతి విద్యార్థులకు  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో   సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, ఆదివాసి నాయకుడు రాందాస్, పాఠశాల  ఉపాధ్యాయు లు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App