Digital Kasipet:-
గంజాయి పండించే రైతులకు రైతుబంధును నిలిపివేస్తామని దేవాపూర్ ఎస్ఐ విజేందర్ పేర్కొన్నారు. గురువారం కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడితండా - (D) గ్రామంలో మత్తుపదార్థాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడూ పిల్లల్లో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలన్నారు. చెడు వ్యవసనాలకు అలవాటు పడుతుంటే ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి కాపాడ వచ్చని తెలిపారు. మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా మార్చాలంటే తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దల సహకారం అవసరమని అన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటున్నా, క్రయ, విక్రయాలు చేసినా నేరమని, అలాంటి వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన కోరారు. అనంతరం నాయకపుగూడ, లంబాడితండా, గోండు గూడ ల స్థానిక పేదలకు, వృద్దులకు 280 దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రజల రక్షణ కోసం, భద్రత మరియు వారి అవసరాలను చట్టపరిధిలో పరిష్కారం చేస్తూ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని అన్నారు.