Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీ లో బుధవారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షల వ్యయంతో మూడు సిమెంటు రోడ్ల పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పనులను ఎంపీపీ రోడ్డ లక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ కటకం రవీందర్, మద్దిమాడ సర్పంచి ఆడ జంగు,ఓసిసి యూనియన్ గుర్తింపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతి రెడ్డి, తెరాస పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రమణా రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు వాడ్లురి మల్లేశ్, నాయకులు అనంత రావు, పుర్షోతం,బింగి శ్రీనివాస్,గోనె రవీందర్,కైలాష్, వార్డ్ సభ్యుడు సిడం శంకర్ తదితరులు పాల్గొన్నారు.