Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గంజాయి మొక్కలు దొరికితే క్రిమినల్ కేసులు

Digital Kasipet:- 
గ్రామాలలో ఇండ్ల దగ్గర గాని, బయట పొలాలలో గాని గంజాయి మొక్కలు దొరికితే సంబంధికులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి PD యాక్ట్ కేసునమోదు చేస్తామని దేవాపూర్ ఎస్ఐ విజేందర్ పేర్కొన్నారు. బుధవారం దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో దేవాపూర్ స్టేషన్ పరిధిలోని ధర్మారావుపేట, మల్కపల్లి  ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్, యువత కి నిషేధిత డ్రగ్స్, గంజాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాపూర్ ఎస్ఐ విజేందర్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని అన్నారు. గంజాయి మత్తులో యువత తమ జీవితాలను చిత్తు చేసుకోవద్దన్నారు. గంజాయికి బానిస అయి ఎందరో యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి సాగు, నిల్వ, రవాణా, సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. తమ గ్రామంలో ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, సరఫరా చేసిన సేవించినా 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని మరియు వారికి తగిన పారితోషికం అందివ్వనున్నట్లు వివ రించారు. డ్రగ్స్  గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ ను  సమూలంగా అరికట్టడంలో ప్రజా ప్రతినిధుల తో పాటు గ్రామ ప్రజల పై కూడా బాధ్యత ఉందని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా వాటి సరఫరా, ఉత్పత్తులు జరిగిన, ఎవరైనా వినియోగిస్తున్న వెంటనే సమాచారం అందించాలని కోరారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App