Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఓరియంట్ కంపెనీలో లోడింగ్ కార్మికుల ఆందోళనలు

Digital Kasipet:- 
మంచిర్యాల  జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో గురువారం సాయంత్రం లోడింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు డ్యూటీలు కల్పించాలని లోడింగ్ కార్మికుడు సిడం శంకర్ సైలో ఎక్కి ఆందోళనకు దిగారు. అతనికి మద్దతుగా మిగతా లోడింగ్ కార్మికులు కూడా విధులు బహిష్కరించి  ఆందోళనలో పాల్గొన్నారు. 2015 లో హైకోర్టు తీర్పు ప్రకారం లక్కీడ్రా ద్వారా ఎంపికైన 30 మంది లోడింగ్ కార్మికులకు గత ఏడు సంవత్సరాలుగా నెలలో 15 డ్యూటీలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. డ్యూటీ లు లేక తమ కుటుంబాలు పస్తులతో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉద్యోగంలో తీసుకున్నప్పుడు 26 రోజుల మాస్టార్లు  ఇస్తానన్న యాజమాన్యం హామీ నెరవేర్చడం లేదని కార్మికులు వారి కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని ఇటీవల ఐటిడిఎ, పి వో కు , జిల్లా కలెక్టర్ కు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. కార్మికుల ఆందోళన విరమించేందుకు కార్మిక నాయకులు, పోలీస్ అధికారులు కార్మికుల కుటుంబాలకు నచ్చచెబుతున్నారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని గేటు ముందు బైఠాయించారు. యాజమాన్యంతో గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు కార్మిక నాయకులు చర్చలు  జరుపుతున్నారు. మందమర్రి  సిఐ ప్రమోద్ రావు, దేవాపూర్ ఎస్సై విజేందర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App