Digital Kasipet:-
భారత రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాయాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని దేవాపూర్ అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. శనివారం కాసిపేట మండలం దేవాపూర్ గ్రామం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సమావేశమై కెసిఆర్ వ్యాఖ్యానాలను ఖండించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు. రాజ్యాంగం లేకుంటే బహుజనుల బ్రతుకులు ఆగమయ్యే వాని అన్నారు. ప్రధాన కార్యదర్శి వడ్లూరి మల్లేష్ మాట్లాడుతూ విశ్వ మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సరైంది కాదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యానాలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు రామిళ్ళ కిష్టయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలనడం కెసిఆర్ దురహంకారానికి నిదర్శనమని అన్నారు. కెసిఆర్ మాటలను ఎస్సీ ఎమ్మెల్యేలు సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. దేవాపూర్ కాంగ్రెస్ నాయకుడు మెరుగు శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోందని, రాజ్యాంగం వల్లనే బహుజనులకు రిజర్వేషన్ల వల్ల విద్యా,ఉద్యోగ, రాజకీయాల వల్ల పదవులు వచ్చి సమాజంలో గౌరవంగా జీవిస్తు న్నారని అన్నారు. దేవాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గసికంటి మల్లేష్ మాట్లాడుతూ తల్లిలాంటి రాజ్యాంగాన్ని మార్చడం సరైందికాదని, ఎస్సీ ఎమ్మెల్యేలు సమర్థించడం సరి కాదని అన్నారు. తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలనే పాటలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేవాపూర్ మాజీ ఎంపిటిసి రాజమౌళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి అనడం సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పంగా లచ్చయ్య, మహేష్, వెంకటేష్, ముల్కల స్వామి, సాత రాజు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.