Digital Kasipet:-
కాసిపేట మండలం కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుడు చత్రపతి శివాజీ 392వ జన్మ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడీ రామచందర్, మండల శాఖ నాయకులు శివాజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాష్ట్రలో బహుజనుల విముక్తి కోసం ముస్లిం రాజులతో పోరాడారని అన్నారు. బహుజనుల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన చత్రపతి శివాజీ జన్మ దినోత్సవ కార్యక్రమాలు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య, సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిశాల బాపు, మండల సలహాదారు లంక లక్ష్మణ్, నాయకులు మోటూరు వేణు, బుగ్గ రాజు, అగ్గి స్వామి, కొమ్ము భీమయ్య,వేల్పుల బలరాం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.