Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సంక్షేమ పథకాలతో తెలంగాణలో పేదరికాన్ని పారదోలిన ముఖ్యమంత్రి కెసిఆర్ - దుర్గం చిన్నయ్య

Digital Kasipet:-  
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల అభ్యున్నతి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో  ప్రవేశపెట్టి పేదరికాన్ని పారదోలడాని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా తమ రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలని కోరుతున్నారన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకాలు ప్రవేశపెట్టాలంటే కెసిఆర్ దేశ ప్రధాని అయితేనే సాధ్యమవుతుంది అని అన్నారు. సోమవారం కాసిపేట మండలం ముత్యంపల్లి, కోమటి చేను పంచాయితీ పరిధిలోని గురువాపూర్ రేగుల గూడెం గ్రామాల మధ్య ప్రవవహించే సల్పల వాగుపై  3.75 కోట్ల వ్యయంతో నిర్మించే  వంతెనకు భూమి పూజ చేశారు. తదనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని అన్నారు. ఉద్యమకాలంలో  గ్రామాలలో పర్యటించిన సందర్భంగా ప్రజల  స్థితిగతులను తెలుసుకున్నాడ న్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు, మరో వైపు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడని అన్నారు. ప్రపంచంలో కాని దేశంలో కానీ ఎక్కడ  లేనివిధంగా రైతులకు పెట్టుబడి సహాయం చేస్తూ పంటలకు  గిట్టుబాటు ధర వచ్చేలా మధ్య దళారీల ప్రమేయం లేకుండా రైతులను ఆదుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు. గ్రామాలలో రహదారులను, వాగులపై  వంతెనల నిర్మాణం కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో కెసిఆర్ నడిపిస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఇష్టం వచ్చిన తీరుగా  మాట్లాడుతున్నారని విమర్శించారు. బిజెపి నాయకులు గ్రామాలలోకి వస్తే నిలదీయాలని పిలుపు ఇచ్చారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడ రైతుబంధు, ఆసరా, కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. అక్కడి  బిజెపి నాయకులు ఇక్కడికి వచ్చి  కెసిఆర్ ను విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రంలోని  నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని  గద్దె దించేందుకు మనమే శ్రీకారం చుట్టాలని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలంతా కేసీఆర్ వెంట ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. జెడ్పిటిసి పల్లె చంద్రయ్య మాట్లాడుతూ కాసిపేట మండలంలో సుమారు పది కోట్ల నిధులతో మామిడి గూడెం,పెద్ద ధర్మారం, రేగుల గూడెం గురువాపూర్, చింతగూడెం గ్రామాల మధ్య రహదారులు, వాగుల పై వంతెన లను నిర్మించుకోవడం  జరుగుతుందని అన్నారు. 96 లక్షల NRGES నిధులతో గ్రామాలలో సిమెంట్ రోడ్లను నిర్మించుకోవడం జరుగు తుందన్నారు . బెల్లంపల్లి  నియోజకవర్గానికి దుర్గం చిన్నన్న  ఎమ్మెల్యే గా ఉండడం కాసిపేట మండల ప్రజల అదృష్టమని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ రోడ్డ లక్ష్మి, ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, సింగిల్ విండో చైర్మన్ బీ.నీల రామ్ చందర్  పల్లంగూడా ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి, సర్పంచ్ ఆడే బాదు, కోమటి చేను సర్పంచి ఆర్ శ్రీనివాస్, మండల రైతు సంఘం అధ్యక్షుడు దుర్గం పోశం, ఓ సి సి కార్య  నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మంచిర్యాల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సఫాట్ శంకర్, మాజీ సింగిల్విండో చైర్మన్ వంశీధర్ రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు రాంటెంకి  వాసుదేవ్, ఏనుగు మంజుల రెడ్డి  మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, మండల తెరాస నాయకులు మదన్ రావు, లంక లక్ష్మణ్, బోయిని తిరుపతి, అగ్ని సత్తయ్య, రామ్ చందర్, తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App