Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Digital Kasipet:- 
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ గ్రామ పంచాయితీ  కార్యాలయం ముందు శనివారం ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కాల సూచికను కాసిపేట మండల పరిషత్  అధ్యక్షురాలు  రోడ్డ లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు మాట్లాడుతూ నాయకపోడ్ తెగ  ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలను నేటి సమాజం  తెలియ చేయడం కోసమే క్యాలెండర్ ను విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచి తిరుమల అనంతరావు, ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం నిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏనుగు తిరుపతి రెడ్డి, ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకపోడ్ సేవా సంఘం మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, దేవాపూర్ మాజీ ఎంపీటీసీ రొడ్డ కిష్టయ్య, యువ శక్తి యువజన సంఘం అధ్యక్షుడు దండ వేణి  చందు , నాయకపోడ్ సేవా సంఘం నాయకులు భీమిని మహేందర్, రోడ్డ రాజం,రోడ్డ మల్లేష్, పెద్ద మనిషి రోడ్డ రాజం, తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App