Digital Kasipet:-
శ్రీ సాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, పాత తిరుమలపూర్ గ్రామంలో 20 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 50కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. మరియు గ్రామంలోని ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి 40 బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీ సాయి ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత కొంతకాలంగా ఎన్నో రక్తదాన కార్యక్రమాలు మరెన్నో సేవ కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రొట్టపెల్లి (పాత తిరుమలపూర్) గ్రామ సర్పంచ్ పెంద్రం కవిత హనుమంతు మాట్లాడుతూ శ్రీ సాయి ఫౌండేషన్ సబ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామటేంకి రాజలింగు, ఎంబడి కిషన్, అక్షయ్ కుమార్, సంతోష్, అభిలాష్, శుభం, రంజిత్, నవీన్, సాయి రెడ్డి, రాజశేఖర్, నరిషమాలు, సిద్దు, విష్ణు వర్ధన్, అంజు, సాయి తదితరులు పాల్గొన్నారు.