Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జ్యోతి సావిత్రిబాయి పూలే 191 వ జయంతి

Digital Kasipet:- 
సామాజిక విప్లవకారిణి, సంఘ సంస్కర్త, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 191 వ జయంతి కార్యక్రమం కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సావిత్రిబాయి చిత్రపటానికి  మండల ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పూల మాలలు వేసి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిసెల బాపు అధ్యక్షత వహించాడు. కార్యక్రమం ప్రారంభంలో సావిత్రి బాయ్ పూలే చిత్రపటానికి  ప్రజా ప్రతినిధులు అయిన ముత్యం పల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచి బాపు, పెద్దన పల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ధర్మారావు పేట ఎంపీటీసీ పార్వతి మల్లేష్,కాసిపేట ఉప సర్పంచ్ పిట్టల సుమన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య, గోలేటి స్వామి ,సలహాదారులు లంక లక్ష్మణ్, శిలోజు మురళి, గోనెల శ్రీనివాస్ లు పూలమాలలు వేశారు. తదనంతరం అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ  భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. విద్య లేకపోవడం వల్లనే బహుజన సమాజం వెనకబడి పోయిందని వారికి విద్యాబోధన చేసేందుకు పాఠశాలలు ప్రారంభిం చిందన్నారు . స్నేహితురాలు షేక్ ఫాతిమా ఇంటిలోనే  మొట్టమొదట పాఠశాల ఏర్పాటు చేసి  శూద్ర, అతి శూద్రులు పిల్లలకు బోధన చేసిందన్నారు. పాఠశాలను ప్రారంభించిన సందర్భంగా మనువాదులు దాడులకు దిగిన భయపడిన విద్యా బోధన సాగించింది అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ అసలైన చదువుల తల్లి సరస్వతి దేవి కాదని సావిత్రిబాయి పూలే  అని అన్నారు.మనువాదులు చరిత్రను వక్రీకరించి చారిత్రక  వ్యక్తి కానీ సరస్వతి దేవి చదువుల తల్లి అంటూ ప్రచారం చేస్తున్నారనిన్నారు.భారతదేశంలో మొట్టమొదట శూద్ర,అతిశూద్ర వర్గాలకు  విద్యాబోధన నేర్పిన  సావిత్రి బాయిని ఉద్దేశపూర్వకంగానే  విస్మరించరన్నారు. సావిత్రిబాయి పూలే మూలాలు తెలంగాణ లో ఉన్నాయన్నారు. సావిత్రిబాయి తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లా బోధన్ లో నివసించి మహారాష్ట్రకు వలస వెళ్లారన్నారు. బహుజనుల పిల్లలను విద్యావంతులను చేసేందుకు పాఠశాలలు తెరిస్తే శూద్రుల పిల్లలు చదువుకోవడానికి వీలులేదని బ్రాహ్మణ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. ఆమెపై భౌతిక దాడులు దిగుతూ పేడ నీళ్లు చల్లుతూ అవమానాలకు గురి చేశారన్నారు.  పూలే పోరాటాల ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం  వితంతు పునర్వివాహ చట్టం తెచ్చిందన్నారు. ప్లేగు వ్యాధి  పిల్లలకు సహాయం చేస్తున్న క్రమంలో వ్యాధికి బలైపోయిన మహనీయురాలని సావిత్రిబాయి సేవలను కొనియాడారు. 180సంవత్సరాల క్రితం  బహుజనులకు మహోన్నత సేవలందించిన  సావిత్రిబాయి బాయి జీవిత చరిత్ర పాఠ్యాంశాల్లో నోచుకోలేదని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజన పోరాటయోధుల జన్మదిన, వర్ధంతి కార్యక్రమాలన్నీ  కులాలకు అతీతంగా అందరం కలిసి చేసుకుందామని పిలుపునిచ్చారు. సమావేశానికి వందన సమర్పణ  పెద్దపల్లి సర్పంచి  వేముల కృష్ణ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శులు గొడిశల సురేందర్, లంక రాకేష్ , కార్యవర్గ సభ్యులు దుర్గం రామచందర్, గొడిశల అజయ్, సిద్ధార్థ  సోదరి తిరుపతి ,పెద్దన పల్లి  పంచాయతీ వార్డు సభ్యులు కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App