Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రెస్ క్లబ్ లో SCV డిజిటల్ మీడియా ప్రారంభోత్సవం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల వల్ల యువత చెడు అలవాట్లకు దూరమై సన్మార్గంలో వెళుతుందని ఎంపీపీ రోడ్డ లక్ష్మి అన్నారు. ఆదివారం కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన  డిజిటల్, సోషల్ మీడియా ప్రారంభోత్సవ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత రెండు ఏళ్ళుగా సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాల వల్ల గ్రామాల్లో చాలా మార్పు వస్తుందని అన్నారు. ముఖ్యంగా యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చేపట్టి మండల అభివృద్ధి లో ప్రముఖ పాత్ర వహించాలని సామాజిక చైతన్య వేదికను కోరారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక  దేశానికి సేవ చేసిన మహనీయుల జీవితాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించేందుకు ఏర్పాటు చేస్తున్నా  జయంతి, వర్ధంతి కార్యక్రమాల వల్ల మహనీయుల త్యాగాలను తెలుసుకుని ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని అన్నారు. సామాజిక చైతన్య వేదిక   కార్యక్రమాలు మండల ప్రజలను, యువతను ఆకట్టుకుంటున్నాయి అని అన్నారు. భవిష్యత్తులో   సోషల్ మీడియా ద్వారా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను ప్రజలను, యువతను చెడు మార్గాలను విడిచి అభివృద్ధి పథంలో నడిచే విధంగా చూడాలని అన్నారు. స్వేరో రాష్ట్ర కో కన్వీనర్ బన్నా లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మీడియాలో  ప్రజల వాయిస్ వినపడడం లేదని సోషల్ మీడియా ని ప్రజల గొంతుక అయిందని అన్నారు. ప్రధాన మీడియాకు పోటీగా  సోషల్ మీడియా ప్రజల ఆదరణ పొందేందుకు కృషి చేయాలన్నారు. మండలంలో సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ద్వారా పెను మార్పులు రావాలని బహుజన ప్రజల గొంతు కై నిలవాలని కోరారు. బహుజన సమాజానికి చేరువై  వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోఆర్డినేటర్ పల్లె మల్లయ్య మాట్లాడుతూ సమాజంలో మార్పులు తీసుకువచ్చి ప్రజలను చైతన్యవంతం చేసే లక్ష్యంతో సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా తాము నిర్వహించే కార్యక్రమాలతో ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చిందని అన్నారు. ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తూ మండల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించేందుకు సోషల్ మీడియా రంగంలో ప్రవేశించడం జరిగిందని అన్నారు. మండల ప్రజలంతా సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియాను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న సమాజాన్ని మేలుకొలు పాలనే  సదుద్దేశంతో సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశానికి ఎంతో సేవ చేసి తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల చరిత్రలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసి చైతన్యవంతం చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే తరుణంలో   ఎందరో తమను  అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వెనుకడుగు  వేయకుండా ముందుకే సాగుతున్నామని అన్నారు. సోషల్ మీడియా ప్రారంభం ద్వారా మండలంలో మా కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతాయని అన్నారు. సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమన్న మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక ఏర్పాటుతో మండలంలో ఎన్నో మార్పులు సంభవించాయి అన్నారు. సోషల్ మీడియా  ద్వారా ప్రజలకు మరింత చేరువై ప్రజలను చైతన్యవంతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించడం జరుగుతుందని అన్నారు. ఆ సంస్థకు మండలంలోని నాయకులు మేధావులంతా సహకరించాలని కోరారు. నాయక్ పోడు సేవ సమితి మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక మారుమూల గ్రామాల్లో సైతం కార్యక్రమాలు చేపట్టడం వల్ల  గిరిజనులు ఎంతో చైతన్యవంతం అవుతున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా పల్లెపల్లెకు సామాజిక చైతన్య వేదిక కార్యక్రమాలు విస్తరించి ప్రజలను మేలుకొలుపు అని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సమాజిక చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు గొడిసెల రాజేశం మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్రం వల్ల  సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా మండల ప్రజల గొంతుక గా వస్తుందన్న అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువై చైతన్యవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. సమాజంలో మార్పు కొరకు  ప్రతి ఒక్కరి ఆలోచనలు, భావనలు విప్లవాత్మకంగగానే ఉంటున్నాయి, కానీ ఆచరణలో అమలు కావడం లేదని అన్నారు. దీనికి ప్రధానమైన కారణం మనిషిలో  ఉన్న 'అహం' మే కారణమని అన్నారు . మనుషుల్లో ఉన్న అహంకారాన్ని వదిలి మానవతా విలువలను పెంచుకుని సమాజ మార్పు అందరూ కృషి చేయాలని అన్నారు. తదనంతరం సామాజిక చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ను ఎంపీపీ రోడ్డు లక్ష్మి, డిజిటల్ పేపర్ ను ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లంక లక్ష్మణ్, అగ్గి సత్యం, బుగ్గ రాజు, సామాజిక చైతన్య వేదిక యువజన విభాగం అధ్యక్షుడు కలువల శ్రీనివాస్, నాయకులు రామటెంకి శివ తేజ, కొమ్ముల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App