Digital Kasipet:-
కాసిపేట మండలంలో బుధవారం 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ భూమేశ్వర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎంఏ అలీ జాతీయ జెండాను ఎగరవేశారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో కర్మాగార అధ్యక్షుడు ఎస్.కె పాండే, దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విజేందర్, కాసిపేట పోలీస్ స్టేషన్ లో ఎస్సై నరేష్, కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్, దేవాపూర్ నాయక్ గూడెంలో నాయక్ పోడ్ సేవా సమితి రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, ముత్యంపల్లి గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. కాసిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదరి సురేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో సర్పంచ్ ల ఆధ్వర్యంలో కార్యదర్శులు జాతీయ జెండాలు ఎగురవేసారు.