Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి ఫిబ్రవరి 7 వరకు మేకలు మరియు గొర్రెలకు ఉచిత PPR దొబ్బరోగం టీకాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాసిపేట గ్రామంలో 300 మేకలు మరియు 2100 గొర్రెలకు ఉచిత PPR దొబ్బరోగం టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. తిరుపతి , పశువైద్యశాల సిబ్బంది రమేష్, మరియు రవీందర్ పాల్గొన్నారు.