Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ రోడ్డ లక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో గత 3 నెలలుగా జరిగిన ఆయా అభివృద్ధి పనుల గురించి సంబంధిత శాఖల అధికారులు నివేదికలు చదివి వినిపించారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు ఫిబ్రవరి 1 నుండి మండలంలో అన్ని పాఠశాలలు ఓపెన్ అవుతాయని ఎంపీడీఓ ఎంఏ అలీం తెలిపారు. మండలంలో గంజాయి వాడకం పెరుగుతుందని, యువత మత్తుపదార్థాలకు బానిస అవుతున్నారని పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలను, అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాప్ లను అరికట్టాలని డిమాండ్ చేసారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని excise కానిస్టేబుల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విక్రమ్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ లు, సర్పంచులు పాల్గొన్నారు.