Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ కొత్త కాలనీలో ఎంపీటీసీ నిధులు, జడ్పీటీసీ నిధులు 5లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణపనుల కొరకు భూమి పూజ చేశారు. అంతకుముందు మాత్మా గాంధీ వర్దంతి సందర్బంగా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్దనపెల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనులు మంజూరు కోసం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమమంలో స్థానిక సర్పంచ్ వేముల క్రిష్ణ, జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య.ఎంపీపీ రొడ్డ లక్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, ఉపసర్పంచ్ మైసక్క, వార్డు సభ్యులు మరియు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెల్ది శ్రవణ్, వంశీ, రోడ్డ రమేష్ , శేఖర్, అగ్గి సత్యం, లంక లక్ష్మణ్ , బుగ్గన్న తదితరులు పాల్గొన్నారు.