Digital Kasipet:-
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో ఆదివారం మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. తదనంతరం గ్రామ కమిటీ ఎంపిక జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి మండల కమిటీ అధ్యక్షుడు జాడీ రామచందర్ ఆధ్వర్యంలో కార్యవర్గం నాయకులు పూలమాలలు వేసి ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు జాడి రామచందర్ మాట్లాడుతూ కాసిపేట మండలంలో అంబేద్కర్ భావజాలాన్ని ఇంటి,ఇంటికి తీసుకెళ్లాలని బహుజనులు అందరూ ఐక్యతతో ఉండాలనే లక్ష్యంతోనే అన్ని కులాలను కలుపుకొని అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీలు వేయడం జరుగుతుందని అన్నారు. గతంలో అంబేద్కర్ సంఘం అంటే మాల-మాదిగలు, నేతకాని కులస్తులకు మాత్రమే పరిమితమయ్యాడు అని అన్నారు. అంబేద్కర్ వాదాన్ని యువకులు తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా జనాభాలో 85 శాతం ఉన్న ప్రజలను 15 శాతం ఉన్న వారే పరిపాలిస్తున్నారు అని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కోసం కులాల పేరిట మతాల పేరిట విభజించి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ద్వారా అగ్రవర్ణాలు మనలను ఒకరికొకరు కలవకుండా కుట్రలు చేసీ పరిపాలన చేస్తున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రానికి ముందే అంబేద్కర్ దేశం అభివృద్ధి చెందాలంటే బహుజన కులాల ఆకలి బాధలు తీర్చేందుకు మూడు ప్రతిపాదనలు చేశాడని అన్నారు. దేశంలోని పరిశ్రమలను, భూములను, సహజ సంపదలు అన్ని జాతీయం చేయాలన్నారు. అంబేద్కర్ పెట్టిన ప్రతిపాదనలు ఆ రోజు అంగీకరిస్తే ఈ రోజు దేశం ఎంతో అభివృద్ధి పథంలో ఉండేదని అన్నారు. అంబేద్కర్ ప్రతిపాదనలలోని బడా పెట్టుబడిదారులు, భూస్వాములలు వ్యతిరేకించడం వల్ల 85 శాతం ఉన్న బహుజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. దేశంలో పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉందని అన్నారు. అంబేద్కర్ మండల యువజన సంఘం ఇంచార్జి బన్నా లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి విశ్వగురువు అని అన్నారు. ప్రపంచం లో ఉన్న ఐదుగురు మేధావులలో అంబేద్కర్ ఒక్కరని అని అన్నారు. అంబేద్కర్ కొన్ని కులాలకు చెందిన వ్యక్తి కాదని అన్ని వర్గాలకు నాయకుడని బీసీ రిజర్వేషన్లు 27 శాతం సాధించిన మహనీయుడు అన్నారు. అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాలంటే యువకులంతా అంబేద్కర్ వాదాన్ని చదవాలని అన్నారు. గ్రామములో గ్రంథాలయం పెట్టుకుంటే పది వేల రూపాయల వరకు పుస్తకాలను అందజేస్తానని
అన్నారు. సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ దేశంలో వేల సంవత్సరాలుగా అంటరానితనం కులవివక్ష కొనసాగుతూనే ఉందని అన్నారు. మనిషిని మనిషిగా గుర్తించని మత వాదం ఈ దేశంలో కొనసాగుతుందని అన్నారు. బహుజన వర్గాలు అన్ని చదువుకొని జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఇప్పటికీ బహుజనుల మంతా అడుక్కునే కొనే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుకన్నాడు అని అన్నారు. అంబేద్కర్ మార్గంలో పయనించేందుకు బహుజనుల మంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి వడ్లూరు మల్లేష్ మాట్లాడుతూ గ్రామాలలో అన్ని కులాలను కలుపుకొని అంబేద్కర్ కమిటీలు వేయడం శుభసూచకమని అన్నారు. బహుజనుల మైన ఎస్సీ ఎస్టీ బీసీ ల మంతా ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక విభాగం మండల ఇన్చార్జి గొడిశల బాపు మాట్లాడుతూ తరతరాలుగా అగ్రవర్ణాలు ప్రజలందరినీ నాలుగు వర్ణాలుగా విభజించి పై మూడు వర్ణాలకు సేవ చేయడమే శూద్రుల ధర్మం అంటూ ధర్మశాస్త్రాలు తయారుచేసి బహుజనులను దోపిడికి గురి చేస్తున్నాయని అన్నారు. మెజారిటీ బహుజనుల మంతా రాజ్యాధికారం వైపు వెళ్లే విధంగానే ఐకమత్యంతో ముందుకు సాగాలని అన్నారు. అంబేద్కర్ సంఘం లో అన్ని వర్గాల చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య, కోశాధికారి బోయిన బాపు, సలహాదారులు లంక లక్ష్మణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఆవుల సాయి కుమార్, మండల నాయకులు కలవల శ్రీనివాస్, జంజీరాల తిరుపతి ,బుగ్గ రాజు,రత్నం రాజం దేవాపూర్ టౌన్ అంబేద్కర్ సంఘం గౌరవాధ్యక్షుడు గడ్డం పురుషోత్తం , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘం మల్క పెళ్లి గ్రామ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పడిగెల భూమయ్య, గౌరవ అధ్యక్షుడిగా సిడం జంగు, ప్రధాన కార్యదర్శిగా ఆడ జనార్ధన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కోడూరు విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి గా సల్లూరి ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా పడిగెల ఎల్లయ్య, సల్లూరి గంగారాం, దుర్గం రాజేష్, కోడి మేత వసంత్, ప్రచార కార్యదర్శి గా సంఘపు శేఖర్, అధికారిగా శ్రీ రాముల రమేష్, ముఖ్య సలహాదారులు గా కంటం తిరుపతి, తాటిపాముల శంకర్ గౌడ్, రాగం ప్రభాకర్, మాడుగుల వినోద్, కుడి మేత రామయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.