Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి నిరసనగా రాస్తారోకో

Digital Kasipet:- 
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కాసిపేట మండల బీజేపీ నాయకులు ఖండించారు. దాడిని నిరసిస్తూ శుక్రవారం కాసిపేట మండలంలోని కొండాపూర్ యాప ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, రాష్ట్రంలో  పార్లమెంట్ సభ్యులకె రక్షణ లేకపోతే  సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటకపురం రమేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, మహిళా అధ్యక్షురాలు పెరుగు రాజమ్మ, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు బాకీ నరేష్, కార్యదర్శి  బాకీ కిరణ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు సాయి కుమార్, మహిళ ఉపాధ్యక్షురాలు సంధ్య, బిజెపి నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App