Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

16సం గడుస్తున్న ఇంకా పూర్తికానీ ఆరోగ్య ఉపకేంద్రం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని గట్రారావుపల్లి   గ్రామంలో 2004 లో ప్రారంభించిన ఆరోగ్య ఉపకేంద్రము పనులు 16సం గడుస్తున్న ఇంకా పూర్తిచేయలేదని కాసిపేట మండల బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం గట్రారావుపల్లి ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని మండల బీజేపీ నాయకులు సందర్శించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చిన 15 కిలోమీటర్లు ప్రయాణించి చికిత్స చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించి సదరు కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకొని ఆరోగ్య ఉపకేంద్రము పూర్తి  చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య ఉపకేంద్రము పూర్తి చేసి ఆదివాసులకు  వైద్యం అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్, ప్రవీణ్, కొత్తూరి నరసయ్య, ఆత్రం అచ్యుతరావు, సిద్ధం రాజు, కోవా ధనుష్, అర్క ఇసురు, కుడిమేత ఇసురు, కుడి మేత రామకృష్ణ, కుడిమేత జగ్గు తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App