Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శం - ఎమ్మెల్యే చిన్నయ్య

Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన దేశానికి
ఆదర్శమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొనియాడారు. సోమవారం కాసిపేట మండల కేంద్రంలో జరిగిన రైతుబంధు విజయోత్సవాలను లో భాగంగా ఎడ్ల బండి ర్యాలీ చేసి పాదయాత్రలో పాల్గొన్నారు. తదనంతరం   రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కెసిఆర్ ముఖ్యమంత్రి గా రైతుబంధు, కల్యాణ లక్ష్మి, అమ్మ ఒడి, ఆసరా  పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛను పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నర న్నారు. కెసిఆర్ పాలన ఓర్వలేక బీజేపీ,కాంగ్రెస్ నాయకులు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి నాయకులు వారి కుటుంబాలు, బంధువులు కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం  సిగ్గుచేటని విమర్శించారు . తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా వల్ల రైతులు ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. ఉద్యమ నాయకుడు కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉండడం వల్ల ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశం  పెట్టడం జరిగింది అన్నారు. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా పేదలకు ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని అన్నారు. గుజరాత్ లో 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ  ఆసరా పింఛన్లు పేదలకు ఏడు వందల రూపాయలకు  మించి ఇవ్వడం లేదని అన్నారు . ఒంటరి మహిళలకు పెన్షన్ లు లేవని అన్నారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్న ఎవరు పింఛన్లు ఇవ్వడం లేదని, తెలంగాణ రాష్ట్రంలో ఒకరికి రెండు వేల పింఛన్ ఇస్తూ ఉంటున్న ది కెసిఆర్ ప్రభుత్వమేనని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వేల ఎకరాలకు ఒక క్షేత్ర   సహాయకుని నియమించింది అని అన్నారు. రైతుల కోసం రైతు వేదికలు ఏర్పాటుచేసి, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తూ ఆదుకుంటుందని అన్నారు. పిల్లలు చదువుకొని బాగుపడాలని     ప్రత్యేక నిధులు కేటాయిస్తూ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించే వారిని నిలదీయాలి 
గత ఏడేళ్ల తెరాస పాలనలో  ప్రజలంతా సుఖశాంతులతో ఉంటే  కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఓర్వలేక సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు.  స్వార్ధ రాజకీయాలు చేస్తూ ప్రభుత్వానికి  చెడ్డపేరు తెచ్చి కుట్ర   చేసి కూలగొట్టి ప్రయత్నాలు చేస్తున్నారని  ఆరోపించారు. రైతులు ప్రజలు బిజెపి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నిలదీయాలని అన్నారు.   కెసిఆర్ పాలన ను, రాష్ట్రంలో  ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతిపక్ష  నాయకులు విమర్శిస్తే వారికి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో కూడా తెరాస విజయానికి కృషి చేస్తూ కెసిఆర్ ముఖ్యమంత్రి గా చేసేందుకు తెరాస శ్రేణులు  తీవ్రంగా కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మండల జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వందన, విస్తరణ అధికారులు తిరుపతి,శ్రీనివాస్  ముత్యం పల్లి గ్రామ సర్పంచ్ ఆడే బాదు,  కాసిపేట  సర్పంచి  ధరావత్ దేవి, పెద్దనాపల్లి ఎంపీటీసీ కొండ బత్తుల రామచందర్, సింగిల్విండో చైర్మన్ బాధవత్ నీల, మండల తెరాస పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి , ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మంజుల రెడ్డి, వాసుదేవ్,కో ఆప్షన్ సభ్యుడు శిరాజ్ ఖాన్  తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App