Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పల్లంగూడ పంచాయితీలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలు గా మండల కమిటీ అధ్యక్షులు జాడి రామచందర్, ప్రధాన కార్యదర్శిగా వడ్లూరు మల్లేష్, సాంస్కృతిక విభాగం ఇన్చార్జి గొడిశాల బాపు, మండల కమిటీ సభ్యులు హాజరై గ్రామాల్లోని సమస్యలను తెలుసుకున్నారు. తదనంతరం పంచాయితీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సంకురు శ్రీధర్, ప్రచార కార్యదర్శి గా రంగు సురేష్, ఉపాధ్యక్షులుగా బద్ది సంతోష్, కోవా తిరుపతి, చిన్న వేణి లింగయ్య, j.శేఖర్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా నవనందులు చంద్రమౌళి ఎంపీటీసీ, దుస్స చందు, సంయుక్త కార్యదర్శులుగా కడప భీమ్రావు, కొక్కుల రజనీకాంత్, పార్వతి ప్రశాంత్, అల్లంల మహేష్, ప్రచార కార్యదర్శులుగా తాళ్ల పెళ్లి పెద్ద స్వామి, తాళ్ల పెళ్లి చిన్న స్వామి, మీడియా ఇన్ఛార్జి గా గాండ్ల సునీల్, కోశాధికారిగా అందం రాజయ్య సలహాదారులుగా నవనందుల తిరుపతి, తాండూర్ లింగయ్య, రంగు లక్ష్మయ్య, తాళ్ల పెళ్లి బాపు, నల్లగట్ల సత్తయ్య ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్లంగూడ పంచాయతీ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంకూరి శ్రీధర్ ను పంచాయతీ సర్పంచి విజయ చందులు, ఎంపీటీసీ నవనందులు చంద్రమౌళి, మండల గ్రామ కమిటీ నాయకులు శాలువాలతో సన్మానించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఎంపికై మొదటిసారి పల్లం గూడెం పంచాయతీకి వచ్చిన జాడి రామచందర్ ను గ్రామ సర్పంచ్ దుస్స విజయ చందు లు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు జంజిరాల తిరుపతి, దుర్గం శేఖర్, దేవాపూర్ పట్టణ గౌరవ అధ్యక్షుడు గడ్డం పురుషోత్తం, దేవాపూర్ నాయకులు కాంపల్లి వెంకటేష్ ,మీడియా ఇన్ఛార్జి ఆవుల సాయి కుమార్ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు అల్లము ల స్వామి,పెట్టం రాజేశం మహిళా నాయకురాలు కోవా బాగు బాయ్, చెడ్డ మేని రాధా తదితరులు పాల్గొన్నారు.