Digital Kasipet:-
కేంద్రప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా కాసిపేట మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌక్ వద్ద తెరాస నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.