Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

Digital Kasipet:- 
గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర సాంకేతిక తను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇన్స్పైర్ మేళాలో జాతీయ స్థాయిలో నాలుగో బహుమతి గెలుచుకున్న కాసిపేట మండలం  మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థి జుమ్మి డి రమేష్, గైడ్ టీచర్ వేములవాడ రమేష్ ను బుధవారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మల్కపల్లి  ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. సామాజిక చైతన్య వేదిక నాయకులు, మల్కపల్లి పంచాయతీ సర్పంచ్ కుడిమేత లక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత జుమ్మి డి అంజన్న మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లనే జాతీయ స్థాయిలో బహుమతి గెలుచుకున్నారు అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లు తీవ్రంగా కష్టపడ్డానని అన్నారు. గైడ్ టీచర్ వేములవాడ రమేష్ మాట్లాడుతూ ఇన్స్పైర్ మేళాకు  నేను ఎంచుకున్న ఫీడర్ ఛానల్ మొదట మంచిర్యాల జిల్లా ఇన్స్పైర్ మేళాలో తిరస్కరించబడింది. కరోనా వల్ల ఆన్లైన్ పుణ్యమా అని జూమ్ ద్వారా రాష్ట్ర పరిశీలకులు పరిశీలించి పోటీలో ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలో తిరస్కరించిన ఇదే జాతీయ స్థాయిలో నాకు పథకాలు తేవడం గర్వంగా అనిపించింది అన్నారు. మళ్లీ ఈసారి ఇన్స్పైర్ మేళాలో బహుమతులు గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థి అంజన్న, గైడ్ టీచర్ రమేష్ కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో నాలుగో బహుమతి గెలుచుకుని కాసిపేట  మండలానికి దేశంలో గర్వించే స్థాయికి తీసుకు వెళ్లారని అన్నారు. వీరి స్ఫూర్తితో మండలం లోని ఇతర పాఠశాల విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో ప్రతిభా పాటవాలను ప్రదర్శించి పథకాలు అందుకోవాలని  సదుద్దేశంతో సామాజిక చైతన్య వేదిక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు.Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App