Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం నుండి మామిడి గూడెం వరకు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ2.23 నిధులతో తారు రోడ్డు వేశారు. రోడ్డు వేయడంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా రోడ్డు వేయడంతో వేసిన పది హేను రోజులకే రోడ్డు పగిలి అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు నిరాశ చెందారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా రోడ్డు వేయడంతో ప్రజా సొమ్ము దుర్వినియోగం అయిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పర్సంటేజ్ లు తీసుకొని కాంట్రాక్టర్లకు సహకరిస్తూ ప్రజాసొమ్ము లూటీకి అధికారులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత జిల్లా అధికారులు, నియోజకవర్గ ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని నాణ్యత పాటించకుండా వేసి ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నాణ్యత పరిమాణాలను పాటించి రోడ్డు వేయలని గ్రామ ప్రజలు,బిజెపి నాయకులు అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అటక పురం రమేష్. బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్. మండల కార్యదర్శి బాకి కిరణ్. బీజేవైఎం ముత్యం పల్లి టౌన్ ప్రెసిడెంట్ అంబాల అరవింద్. గ్రామస్తులు ఆదిల్ ఖాన్. అక్బర్ సలీం. షబ్బీర్. సకరి శ్రీనివాస్. చిన్న రాజ లింగు. లతీఫ్ ఖాన్. సాయి. ప్రభాకర్. గ్రామ యువకులు సతీష్. రమేష్. శ్రీకాంత్. హనుమంతు. సందీప్. తదితరులు పాల్గొన్నారు.