Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం లో సోమవారం స్వర్గీయ పద్మశ్రీ డా నేరెళ్ళ వేణుమాధవ్ 90వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దనపల్లి గ్రామ మిమిక్రీ కళాకారుడు గడ్డం శ్రీనివాస్ మరియు వివిధ జిల్లాల నుంచి కళాకారులూ లక్ష్మీపతి (చిత్తూరు), జల్సా జాని (గుంటూరు), రాకేష్ (గూడూరు), గణేష్ (జగిత్యాల),రెడ్డి శేకర్ (కడప), భాగ్య రాజు (కాకినాడ), నుండి వచ్చిన కళాకారులు మిమిక్రీ ప్రదర్శనలు చేసారు. గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ మిమిక్రీ చేయడం అనేది సామాన్య విషయం కాదని ఒకరి కంఠాన్ని ఇంకొకరు అనుకరించడం వెనక చాలా సాధన ఉంటుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను ఆయన సన్మానించారు.