Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రమాదంలో మరణిస్తే ఉచిత 2 లక్షల భీమా

Digital Kasipet:- 
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఉచిత ఇన్సురెన్స్ ఈ-శ్రమ్ పథకం లో భాగంగా సోమగూడెం న్యూ కాలనీ వాసులకు ఈ-శ్రమ్ దరఖాస్తులు చేసారు. సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అనుకోకుండా ప్రమాదం జరిగి మరణిస్తే ఉచితంగా 2 లక్షల రూపాయల భీమా అందుతుందన్నారు. వికలాంగులగా మారితే 1 లక్ష భీమా వర్తిస్తుందన్నారు. కాబట్టి 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వారు ప్రతి ఒక్కరూ ఈ-శ్రమ్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్, గ్రామ యువత, ప్రజలు పాల్గొన్నారు.

E-Shram కార్డు దరఖాస్తు చేసుకోవడానికి Shiva Internet Kasipet , లో సంప్రదించండి.
Cell: 7075675552Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App