Digital Kasipet:-
మందమర్రి ఏరియాలోని కాసిపేట ఒకటో గని పై సింగరేణి కార్మికులు చేస్తున్న సమ్మెకు బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఆయన కండించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, కాసిపేట ఒకటి, రెండో గనుల ఫిట్ కార్యదర్శులు దుగుట శ్రీనివాస్, కారుకురి తిరుపతి, సోమగూడెం సర్పంచ్ ప్రమీలా గౌడ్, ఏరియా నాయకులు, టీబీజీకేఎస్ కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.