Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కు ఘన నివాళులు

Digital Kasipet:- 
కాసిపేట మండల కేంద్రంలో గురువారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ( CDS ) జనరల్ బీపిన్ రావత్ కి నివాళులు అర్పించారు. ఇటీవల తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బీపిన్ రావత్ తో పాటు వారి భార్య, ఇతర మిలటరీ ఆఫీసర్లు  మరణించిన విషయం తెలిసిందే.  కాసిపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిపిన్ రావత్ కి మరియు 12 మంది అమరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దం తిరుపతి పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, కాంగ్రెస్ నాయకులు గోలేటి స్వామి, గాదం గట్టయ్య, మల్లెత్తుల రాజేశం, జాడి శివ, పుర్రె పోషం, కుర్మ నర్సయ్య, సిద్ధం రవి, వీరవేణి శ్రీనివాస్, రవి , బుగ్గ రాజు తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App