Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 137 వ ఆవిర్భావ దినోత్వవాన్ని నిర్వహించి, జెండాని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బన్న అశాలు, ఆకుల పోషం, దుర్గం భీమయ్య లను సన్మానించారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని అన్నారు. ఈరోజు దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసిఆర్ అబద్దాలతో ప్రజలను మభ్య పెడుతు పాలన చేస్తు కొంతమంది పెట్టుబడి దారులకు, వారి కుటుంబాలకు మాత్రమే దేశ, రాష్ట్ర సంపదలను పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ,మెరుగు శంకర్, కనక రాజు, గాదం గట్టయ్య, గోలేటి స్వామి, జాడీ శివ, కొత్త రమేష్, మల్లెత్తుల రాజేశం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.