Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టి ఇవ్వాలని కాసిపేట మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేసారు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ నెరవేర్చడంలేదని మండిపడ్డారు. కట్టిన అరకొర ఇండ్లు కూడా నాణ్యతగా లేవని ఆరోపించారు. ఇప్పటికైన అర్హులందరికీ నాణ్యతతో కూడిన ఇండ్లను కట్టివ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు అట్కపురం రమేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, బీజేవైఎం ముత్యంపల్లి టౌన్ పంబాల అరవింద్, చంద్రయ్య, సందీప్, ప్రవీణ్, కొత్తూరి నరసయ్య, మారం శ్రీనివాస్, రమేష్ తదితులు పాల్గొన్నారు.