Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్ర దహనం

Digital Kasipet:- 
25 డిసెంబర్ 1927న అంబేద్కర్ మనుధర్మశాస్త్రాన్ని దహనం చేసిన సందర్బంగా శనివారం కాసిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం నాయకులు మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు. మనుధర్మశాస్త్రం నశించాలని, భారత రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు చేసారు. ఈ సందర్బంగా గోడిసేల బాపు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు, మహిళలకు స్వేచ్ఛ లేకుండా కట్టు బానిసగా మార్చిన మనుధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ దాహించడం జరిగిందని అన్నారు. కొమ్ముల బాపు మాట్లాడుతూ అంబేద్కర్ హిందూ గ్రంధాలను చదివి అందులో ఉన్న అంటరానితనాన్ని, వివక్షను వ్యతిరేకించి మనుషులందరూ సమానంగా ఉండాలని చెప్పారని అన్నారు. దాసరి రాజయ్య మాట్లాడుతూ భారతదేశానికి అక్రమంగా వచ్చి యుద్దాలు చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసి SC, ST, BC లను చదువుకు దూరం చేశారన్నారు. పల్లె మల్లయ్య మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చి స్థానిక రాజులను ఓడించి మూలభారతీయులను 85% మంది ప్రజలను కులాలుగా వర్గీకరించి మనుధర్మశాస్త్రాన్ని అమలుపరిచారన్నారు. ఈ కార్యక్రమంలో లంక లక్ష్మణ్, గుడిసెల సురేందర్, ఆవుల సాయి కుమార్, గుడిసెల బాలయ్య, జాడి పోశం, బోయిని తిరుపతి, బోగే లక్ష్మణ్, అగ్గి సత్తయ్య, గుడిసెల అభినవ్, గుడిసెల అనిల్ కుమార్, గుడిసెల అజయ్, గుడిసెల నర్సయ్య, లంక రాకేష్, అక్కపల్లి బుగ్గరాజు పాల్గొన్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App