Digital Kasipet:-
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునందన్ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా తో బాధపడే పిల్లల కోసం మెగా రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. కాసిపేట మండలం నుండి భారతీయ జనత యువ మోర్చా కాసిపేట ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ తో పాటు పుట్ట శేఖర్, అగ్గి సాయి, బాకీ కిరణ్ తో పాటు వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.