Digital Kasipet:-
కాసిపేట మండలంలో సోమవారం D.r BR అంబేద్కర్ 65వ వర్ధనతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహనికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాసిపేట మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని పండుగను తలపించేలా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటంతో బహుజన నినాదాలు చేస్తూ, భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగిసిన తరువాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేదికపై మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ ప్రశాంగించారు.