Digital Kasipet:-
కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తీర్థాల భాస్కర్ స్మారక వాలీబాల్ టోర్నీ విజేతగా సోమగూడెం జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో లంబాడి తండా డి, సోమగూడెం జట్లు పోటీపడగా వరుసగా రెండు సెట్లు సోమగూడెం జట్టు గెలిచి టోర్నమెంట్ విజేతగా నిలిచింది. విజేతలకు భాస్కర్ స్వగ్రామం కోనూరు లో బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.గ్రామ సర్పంచి అప్పని స్వరూప, అతడి కుమారుడు వెంకటేష్ దివాకర్ లు ప్రథమ బహుమతి 5116 నగదుతో పాటు మెమొంటో లను అందజేశారు. సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య, మెరుగు శంకర్ ద్వితీయ బహుమతి 3116 తోపాటు మెమొంటో లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్పంచ్ మొక్కల శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి కొండాపూర్ గ్రామ కమిటీ రాజా గౌడ్, సామాజిక చైతన్య వేదిక సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గొడిసెల బాపు, నాయకులు బద్ది శ్రీనివాస్, సోమగూడెం వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు బైరగోని సిద్దయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.