Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నవంబర్ 6న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

Digital Kasipet:-
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, సామాజిక చైతన్య వేదిక మాజీ కోశాధికారి, అమరుడు   తీర్థాల భాస్కర్ ప్రధమ వర్ధంతి సందర్భంగా అతని స్మారకార్థం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను సామాజిక చైతన్య వేదిక నిర్వహిస్తోంది. కాసిపేట మండలం కొండాపూర్ యాప గ్రామంలో ఈ నెల 6,7 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. విజేతలకు ప్రథమ బహుమతి రూ. 5000, ద్వితీయ బహుమతిగా  రూ. 3000 లతోపాటు రోలింగ్ షీల్డ్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మండలంలోని అన్ని గ్రామాల వాలీబాల్ టీములు పాల్గొని విజయవంతం చేయగలరు. 
  ముఖ్య గమనిక  
 కాసిపేట  మండలానికి చెందిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనాలి. స్థానిక క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. టోర్నీలో పాల్గొనే జట్లు ఈనెల 5వ తారీఖు లోగా కొండాపూర్ యాప  ఆగ్రో సెంటర్లో ఎంట్రీ ఫీజు ₹200 చెల్లించి  పేర్లు నమోదు చేసుకోగలరు.
 ఇట్లు 
 పల్లె మల్లయ్య
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు
 కాసిపేట మండలం
Cell no 9618918965
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App