Digital Kasipet:-
కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిచిన తీర్ధాల భాస్కర్ స్మారక మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను శనివారం ఎంపీపీ రోడ్డ లక్ష్మి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్బంగా భాస్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గస్తులైన భాస్కర్ మండలంలో చేసిన ఎన్నో సేవలు మరువలేనివని,ఆయన చనిపోవడం మండలానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేసి, అండగా ఉంటామని అన్నారు. యూవత భాస్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య, కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, కోనూర్ సర్పంచ్ అప్పని స్వరూప, తాటిగూడ సర్పంచ్ ముత్యాల స్వప్న, మార్కెట్ కమిటి డైరెక్టర్ మంజులా రెడ్డి, వేముల క్రిష్ణ, ఆడే బాదు, లయన్స్ గొంది రమణ, మహేష్ ఎంపీటీ సీ కొండబత్తుల రాంచెందర్,కారుకూరి రాంచెందర్, బైరగోని సిద్దయ్య సామాజిక చైతన్య అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు.