Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Digital Kasipet:- కాసిపేట మండల కేంద్రంలో ఇటీవల పలు కారణాలతో ఇద్దరు మృతి చెందగా వారి కుటుంబాలను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం పరామర్శించారు. బోయిని రమేష్ అనే వ్యక్తి ఇటీవల ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబీకులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ. 5 వేల సహాయం అందించారు. అలాగే కాసిపేట మండల కేంద్రంలో లక్ష్మీ అనే మహిళ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. రూ. 5 వేలు సహాయం అందించారు. ఎమ్మెల్యే వెంట వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రం రావు, సర్పంచ్ ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, నాయకులు మోటూరి వేణు, లంక లక్ష్మణ్, సురేందర్, కోప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App