Digital Kasipet:-
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ఐదు రూపాయలు తగ్గించగా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం తగ్గించకపోవడంతో మంగళవారం కాసిపేట మండలంలోని పెట్రోల్ బంక్ ముందు బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన తక్షణమే వ్యాట్ తగ్గించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆటక కాపురం రమేష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సురం సంపత్, మండల ఉపాధ్యక్షులు పోలవేణి పోచం, బీజేవైఎం ముత్యంపల్లి టౌన్ ప్రెసిడెంట్ అరవింద్, బిజెపి నాయకులు బాకి కిరణ్, అంబాల హనుమంతు, కృష్ణ, నరేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.